గుజరాత్‌ అరేబియా సముద్రంలో పడవల బోల్తా


పలువురు మత్స్యకారుల గల్లంతు

అహ్మదాబాద్‌,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 15 మత్స్యకారుల పడవలు గల్లంతయ్యాయి. గురువారం తెల్లవారుజామున గుజరాత్‌లోని  గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా ఉనా హార్బర్‌ సవిూపంలో 15 పడవలు నీటమునిగాయి. దీంతో సముద్రంలో సుమారు 15 మంది గల్లంతై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కాగా, ఎన్ని పడవలు గల్లంతయ్యాయనే విషయంలో స్పష్టత లేదన్నారు. కాగా, పడవల గల్లంతుపై భారత నౌకాదళం అప్రమత్తమయింది. హెలికాప్టర్‌ సాయంతో గాలింపు చర్యలు చేపట్టింది. అదేవిధంగా పోలీసులు, కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా కలెక్టర్‌ ఆహుల్‌ త్రిపాఠి వెల్లడిరచారు.