బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

రంగారెడ్డి, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బులెట్‌ బైక్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బులెట్‌పై ఉన్న విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడిని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు. బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే లారీ అదుపు తప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.