శబరిమలకు ప్రత్యేక బస్సులు

కడప,డిసెంబర్‌21( జనం సాక్షి): జిల్లా నుంచి శబరిమల భక్తులకు సర్వీసులను ఉపయోగిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. అయ్యప్ప భక్తులు కోరితే ప్రత్యేక బస్సులు నడుపుతామని అన్నారు. ఎవరికైన వివాహాలకు, ఇతరత్ర శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇస్తామన్నారు. అలాగే దేవాలయాలకు త్వరలో బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతి పండగ దృష్ట్యా జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్దమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వచ్చే వారి కోసం, తిరుగు ప్రయాణికుల కోసం బస్సు సర్వీసులను నడపనున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అన్ని డిపోల్లో రిజర్వేషన్‌ ప్రారంభించామని చెప్పారు. ప్రయాణికులకు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఎన్ని బస్సులు కావాలన్నా నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్‌ఎం పేర్కొన్నారు. ముందస్తుగా టిక్కెట్లను రిజర్వేషన్‌ చేసుకోవచ్చునని చెప్పారు.