లంచం తీసుకుంటూ దొరికిన జీఎస్టీ అధికారి

అమరావతి, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) :  విజయవాడ జీఎస్టీ సూపరింటెండెంట్‌ జాన్‌ మోషిష్‌ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. సకాలంలో పన్నులు చెల్లించని సంస్థల నుంచి కొంతకాలంగా ఆయన డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడు. పన్నులు చెల్లించనందుకు నష్టపరిహారం కింద వ్యాపార సంస్థల నుంచి లంచం కింద డబ్బులు వసూలు చేస్తుండడంతో సీబీఐకి కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.పక్కావ్యూహం ప్రకారం వ్యాపార సంస్థకు చెందిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటుండగా జాన్‌మోషిష్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.