తెలంగాణలో మరో ఐదుగురికి పదవులు


ఐదు కార్పోరేషన్లకు పలువురి నియామకం

హైదరాబాద్‌,డిసెబర్‌17 (జనంసాక్షి):   రాష్ట్రంలో మరో 5 కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కేసీఆర్‌ నియమించారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించగా, తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గజ్జెల నగేష్‌, తెలంగాణ స్టేట్‌ టెక్నాలజికల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌గా పాటివిూది జగన్‌ మోహన్‌ రావు, తెలంగాణ సాహిత్య అకాడవిూ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్‌, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది.