గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కింద అంబులెన్స్‌ బహుకరణ

  


సింగోటం దేవాలయ అభివృద్దికి నిధులపై ఎమ్మెల్యే హర్షం

హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించు కుని గిప్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి బీరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్‌ను అందించారు. ఈ అంబులెన్స్‌ను మంత్రి కేటీఆర్‌ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ను కోడేర్‌ మండలానికి అందిస్తున్నట్లు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి రూ. 15 కోట్లు మంజూరు చేసినట్లు ప్రణాళిక శాఖ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఆలయ అభివృద్ధికి రూ. 576 లక్షలు, భక్తుల సర్వీసుల కోసం రూ. 84 లక్షలు, వసతి సదుపాయాల కోసం రూ. 330 లక్షలు, నీటి సరఫరాకు రూ. 85 లక్షలు, సీవరేజ్‌, శానిటేషన్‌ కోసం రూ. 76 లక్షలు, భూసేకరణ కోసం రూ. 349 లక్షలను విడుదల చేశారు.