ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
ఖమ్మం,డిసెంబర్10 జనంసాక్షి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్ది తాతా మధు గెలుపు ఖాయమని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చండ్రుగొండ మండలానికి చెందిన ఎంపిటీసీలకు ఆయన స్వాగతం పలికారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్దికి ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఆయన ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, ఎంపిటీసీలు దారా బాబు, నరుకుళ్ల సత్యనారాయణ, లంకా విజయలక్ష్మి, భూక్య రాజి,సంగొండి వెంకటకుమారి, టిఆర్‌ఎస్ నాయకులు మాలోత్ భోజ్యనాయక్, బానోత్ రాముడు, గాదె లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.