ఆర్కె గెస్ట్‌ ఎమ్మెల్యే అంటూ లోకేశ్‌ ఎద్దేవా

గుంటూరు,డిసెంబర్‌9(జనం సాక్షి  ): ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని టీడీపీ నేత లోకేష్‌ ఎద్దేవాచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే.. మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్‌ లెక్చరర్‌గా మారారని విమర్శించారు. వారానికోసారి వచ్చి ఫొటోలు దిగి జంప్‌ అయిపోతున్నారని ఎద్దేవాచేశారు. వైసీపీ పాలనలో మంగళగిరిలో అభివృద్ధి శూన్యమన్నారు. లోకేష్‌ గెలిస్తే ఇళ్లు పీకేస్తాడంటూ దుష్పచ్రారం చేసిన ఆర్కే.. ఇప్పుడు పేదవాళ్ల ఇళ్లను కూలగొట్టడం దారుణమని మండిపడ్డారు. మంగళగిరిలో వేలాదిగా వృద్దాప్య, వితంతు పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. సీఎం ఉంటున్న నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కులేదని తప్పుబట్టారు. చెత్త సీఎంల జాబితాలో దేశంలోనే జగన్‌రెడ్డి నెంబర్‌ వన్‌ అని లోకేష్‌ ధ్వజమెత్తారు.