కోలుకున్న స్పీకర్‌ పోచారం

  


నివాసంలోనే అంబేడ్కర్‌కు నివాళి

హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  గత మూడు వారాల క్రితం కరోనా వైరస్‌ సోకి హోం క్వారంటైన్‌ లో ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పూర్తిగా కోలుకున్నారు. తొలుత హైదరాబాద్‌ ఆసత్పిల్రో చేరి చికిత్స తీసుకున్నారు. తరవాత వైద్యుల సలహా మేరకు ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగాసోమవారం భారతరత్న డా. బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో అంబేద్కర్‌ ఎంతో పాత్ర ఎంతో కీలకమన్నారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ పరిపాలన కొనసాగుతుందన్నారు.