తెల్లాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య
హైదరాబాద్,డిసెంబర్3 జనంసాక్షి :సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిరది. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య చేసుకుంది. బీహెచ్‌ఈఎల్‌లో మధుసూదన్ ఆత్మహత్య చేసుకోగా, భర్త ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న భార్య.. ఇద్దరు పిల్లలతో కలిసి జోగిపేట ఆందోల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిరది. ఆర్థిక కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.