పార్లమెంటులో ఇంకెన్నాళ్లీ ప్రతిష్ఠంభన

ఆ 12మందిని కాదని విపక్షాలు ముందుకు సాగలేవా

ప్రభుత్వాన్ని నిలువరించడంలో విపక్షాల వైఫల్యంన్యూఢల్లీి,డిసెంబర్‌3(జనం సాక్షి)  :  పార్లమెంటులో ప్రతిష్ఠంభన ఇంకెంతకాలమో అన్నది అధికార, విపక్షాలు ఆలోచించాలి. కలసికట్టుగా అనేకానేక సమస్యలపై ప్రజలకు అండగా చర్చించాలి. లేకుంటే భవిష్యత్‌లో ఈ ఇద్దరినీ ప్రజలు నమ్మరని గుర్తించాలి. సభ సజావుగా సాగడం పాలక పక్షానికి ఇష్టం లేదని భావించవలసి వస్తుంది. సభను స్తంభింపజేయడం అన్నది విపక్షంగా  బిజెపి అమలు చేసిన ఎత్తుగడ.  నిబంధనలకు విరుద్ధంగా ఎంపి ల సస్పెన్షన్‌ జరిగిందని, ఎ.పి లు క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని ప్రతిపక్ష పార్టీలు ఒక్కమాటగా చెబుతున్నాయి. అయితే దీనివల్ల అధికార పార్టీకే లబ్ది అన్న విషయం గమనించడం లేదు. సస్పెన్షన్‌కు అనుసరించిన పక్రియలో జరిగిన అవకతవకలను వారు ఎత్తిచూపారు. కొంత మంది సభ్యులు ఆ ఘటనలో కూడా లేరు. ఆగస్టు 11న రాజ్యసభలో ఆందోళన చేసిన 33 మంది సభ్యుల జాబితాను బులెటిన్‌లో విడుదల చేశారు. రాజ్యసభలో సిపిఎం నేత ఎలమరం కరీం పేరు అందులో లేదు. నాడు ఆందోళనలో లేని సభ్యుడిని ఎలా సస్పెండ్‌ చేస్తారని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సభలో ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తినా దాన్ని అనుమతించకపోవడం పార్లమెంటరీ నిబంధనల ఉల్లంఘనే కాగలదు. నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న ఎంపి ల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌ను అధికార పక్షం పట్టించుకోవడం లేదు.  ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి,సభను సజావుగా నడపడానికి ఇటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉందని చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు సమర్ధించు కుంటున్నారు.  ఆగస్టు 11న ప్రతిపక్ష సభ్యులపై మార్షల్స్‌ దాడి చేశారు. ఆ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ ఆగస్టు 13న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు కరీం లేఖ రాసినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా కనీసం విచారణ కూడా చేయకపోవడం ప్రతిపక్షం పట్ల వివక్షకాక మరోటి కాదు. గడచిన ఆగస్టు 11న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభా నియమాలు, విధానాలు, నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై 12 మంది రాజ్యసభ సభ్యులను శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్‌ చేయడం ముమ్మాటికీ ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నమే! సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేయడం, అనంతరం పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టడం ద్వారా విపక్షం ఒక్కటిగా ఉన్నా పార్లమెంట్స మాత్రం సజావుగా సాగడం లేదన్నది గుర్తించడం లేదు. ఆ 12మంది వ్యవహారాన్ని పక్కన పెట్టి ఉద్యమించే వ్యూహం కూడా ప్రతిపక్షాలకు లేదు.  దేశ అత్యున్నత చట్టసభల్లో కార్యకలాపాలు స్తంభించిపోవడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. ఈ ప్రతిష్టంభన సృష్టికర్తjైున పాలక పక్షమే దానిని తొలగించడానికి పూనుకోవాలి. ఎంపిలు క్షమాపణ చెబితేనే సస్పెన్షన్‌ ఉపసంహరణ అని ప్రభుత్వం మొండిగా వాదించడం తగదు. వ్యవసాయ బిల్లులను ఆమోదించినపుడూ, ప్రజా ప్రతిఘటన పర్యవసానంగా ఆ చట్టాలను రద్దు చేసినపుడూ పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే మోడీ సర్కారు మమ అనిపించింది.  అదే ఆనవాయితీగా మారకుండా ఉండేందుకు బిజెపి నిరంకుశ విధానాలను అవలంబిస్తోంది.  పార్లమెంటులో ప్రతిపక్షాల సమన్వయానికి సస్పెన్షన్‌ వ్యవహారం ఒకవిధంగా దోహదపడినట్టుంది. ప్రతిపక్షాలతో ఎడమొఖం పెడమొఖంగా వున్న టిఎంసి ఈ ఆందోళనలో భాగస్వామి అయింది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం ఎంతో అవసరం. రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్న బిజెపిని ఉమ్మడిగా ప్రతిఘటించాలి. ఉభయ సభలు సాగడం, వాటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అధికార పక్షానికే కాదుÑ ప్రతిపక్షాలకు, ప్రజలకు కూడా అవసరం. ఈ ప్రతిష్టంభనకు కారణమైన ప్రభుత్వం ఇకనైనా బాధ్యతగా వ్యవహరించి పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు చొరవ తీసుకోవాలి.