షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
న్యూఢల్లీి,డిసెంబర్7 (జనంసాక్షి): విదేశాలతో భారతదేశం సత్ససంబంధాలు నెలకొల్పే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేగంగా వేస్తున్నారు. చిన్ని పెద్ద అన్ని దేశాల్లో పర్యటిస్తూ దౌత్యపరమైన సంబంధాలు పెంపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిత్రదేశాలైన యూఏఈ, కువైట్‌ల 2022 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలతో 2022 విదేశీ ప్రయాణ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. ప్రధాని మోడీ ’దుబాయ్ 2020 ఎక్స్‌పో’ని సందర్శించనున్నారు. అక్షుఎఆ`19 మహమ్మారి రెండవ వేవ్ సమయంలో భారతదేశానికి అండగా నిలిచినందుకు రెండు మిత్రదేశాలకు ధన్యవాదాలు చెప్పడం ఈ పర్టన ముఖ్య ఉద్దేశ్యమని విశ్వసనీయవర్గాల వెల్లడిరచిన సమాచారం. కరోనా రెండవ వేవ్ సమయంలో భారీ భారతీయ ప్రవాసులను రెండు దేశాలు ఆదుకున్నాయి. భారతదేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సుమారు 4 మిలియన్ల మంది నివసిస్తున్నారు. కువైట్‌లో సుమారు 1 మిలియన్ విదేశీ భారతీయులు ఉన్నారు. అవసరమైన సమయాల్లో భారత ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ధన్యవాదాలు తెలపడంతో పాటు రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సాగనుంది.