కెబిఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత


హైదరాబాద్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):  కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్కు ప్రధాన గేటు వద్ద జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, పోలీస్‌ శాఖల సంయుక్త సమావేశాన్ని  నిర్వహించారు. కేబీఆర్‌ పార్క్‌ విస్తీర్ణం, పార్కుకు వచ్చే సందర్శకుల భద్రత, ఇతర చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత కొంత కాలంగా పార్క్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రస్తుతం కేబీఆర్‌ పార్క్‌ లోపల కెమెరాలు ఉండగా మరో 70 కెమెరాలను అమర్చాలని నిర్ణయించామన్నారు. మొత్తం వంద సీసీ ఏర్పాటు చేసేందుకు జేహెచెఎంసీ సహకరిస్తోందని తెలిపారు. పార్క్‌ సందర్శనకు వచ్చేవారు వ్యక్తిగత భద్రత చర్యలు కూడా పాటించాలని శ్రీనివాస్‌ సూచించారు.