రావత్‌ తదితరులకు పార్లమెంట్‌ ఘనంగా నివాళి

  


హెలికాప్టర్‌ ప్రమాదంపై లోక్‌సభకు వివరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

వరుణ్‌ సింగ్‌ ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నాలు

కొద్దిసేపు మౌనం పాటించి.. శ్రద్దాంజలి ఘటించిన నేతలు

న్యూఢల్లీి,డిసెంబర్‌9(జనంసాక్షి ): తమిళనాడు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక, ఇతర సైనికాధికారుల మృతికి పార్లమెంట్‌ ఘనంగా నివాళి అర్పించింది. మృతులకు సభ నివాళి అర్పిస్తూ కొద్ది సేపు మౌనం పాటించింది. ఇది భారత్‌కు కోలుకోలేని దెబ్బ అని స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ మృతి చెందిన విషయంపై  గురువారం లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో 13 మంది మృతిచెందినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నారని, ఆయన్ను బ్రతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. మిలిటరీ హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ దంపతులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడిరచారు. వెల్లింగ్టన్‌ కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్‌ అయ్యేందుకు అక్కడకు వెళ్లారన్నారు. సులూరు ఎయిర్‌బేస్‌ నుంచి హెలికాప్టర్‌ ఎగిరిందని, 12.08 నిమిషాలకు ఆ హెలికాప్టర్‌తో ఏటీసీ సంబంధాలు తెగిపోయాయన్నారు. అయితే మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్‌ను స్థానికులు చూశారని, దాంట్లో ప్రాణాలను కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన రక్షణ దళ సిబ్బంది పేర్లను రాజ్‌నాథ్‌ చదివి వినిపించారు. పార్డీవ దేహాలను వైమానిక దళ విమానంలో  ఢల్లీికి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షెల్‌ చౌదరి బుధవారమే ఘటనా ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. ఘటనపై ట్రై సర్వీస్‌ ఎంక్వైరీకి ఆదేశించినట్లు చెప్పారు. ఎయిర్‌ మార్షల్‌ మనవేంద్ర సింగ్‌ నేతృత్వంలో విచారణ జరగనున్నది. విచారణ అధికారులు కూడా గుధవారమే వెల్లింగ్టన్‌ చేరారని, వాళ్లు దర్యాప్తు కూడా మొదలుపెట్టినట్లు చెప్పారు. రావత్‌ సహా అందరికీ  పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రాజ్‌నాథ్‌ తెలిపారు. వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడిరచారు. ఒకే ఒక్కడు..! అవును. కున్నూరు ఓఎ చాపర్‌ ప్రమాదంలో ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నది ఒకే ఒక్కడు. అతడే గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌. మృత్యువుతో పోరాడు తున్నారు. వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నారు. వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు.. మరో 48 గంటలు గడిస్తే తప్ప వరుణ్‌సింగ్‌ ఆరోగ్యంపై ఏవిూ చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో విశేష సేలందించారు వరుణ్‌ సింగ్‌. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో డైరెక్టింగ్‌ స్టాఫ్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న శౌర్య చక్ర అవార్డును అందుకున్నారు. గతేడాది అక్టోబరు 12న ఆయన నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. వైఫల్యాన్ని సరిగ్గా గుర్తించారు. ల్యాండిరగ్‌ కోసం తక్కువ ఎత్తుకు విమానం దింపుతుండగా.. పైలట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ పూర్తిగా విఫలం అయింది. నియంత్రణ కోల్పోయింది. అప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించిన వరుణ్‌సింగ్‌ ఫ్లైట్‌ను చాకచక్యంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా దింపారు.2020 అక్టోబర్‌ 12న తేజస్‌ యుద్ధవిమానాన్ని పరీక్షించారు వరుణ్‌ సింగ్‌. అప్పుడు ఆయన వింగ్‌ కమాండర్‌గా ఉన్నారు. విమానం 10వేల అడుగుల ఎత్తులో ఉండగా పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. జనరల్‌గా అలాంటి సిట్యుయేషన్‌లో ఏ ్గªలైట్‌ అయినా విమానాన్ని వదిలేసి పారాచ్యూట్‌తో దూకేస్తారు.కానీ వరుణ్‌ సింగ్‌ మాత్రం అలా చేయలేదు..తన ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసినా రిస్క్‌ చేశారు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. తేజాస్‌ ్గªటైర్‌ ఎయిర్‌క్రాప్ట్‌ను సేఫ్‌ ల్యాండ్‌ చేసినందుకే ఆయనకు శౌర్యచక్ర అవార్డునిచ్చారు. స్పీకర్‌ ఓం బిర్లా కూడా రావత్‌ తదితరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయ్యాయి.