ఓట్లకోసమే దళితబంధు

ప్రేమ ఉంటే తక్షణం అమలు చేయాలి: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);   తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా దళిత బంధుపై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం హుజురాబాద్‌ ఉప ఎన్నికల కోసమే దళితులను మభ్య పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకం తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్నికల తరువాత దళిత బంధు ఎందుకు అమలు కావడం లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, దళితులకు మేలు చేసే ఉద్దేశ్యం ఉంటే తక్షణమే దళిత బంధు కొనసాగించాలని కిషన్‌ రెడ్డి అన్నారు. దళితులపై ప్రేమ కన్నా ఓట్లపైనే కెసిఆర్‌కు ప్రేమ అన్నారు. దళితబంధును అమలుచేస్తామన్న హావిూని నిలబెట్టాలన్నారు.