కోడికి 30 రూపాయల టిక్కెట్‌

పెద్దపల్లి,ఫిబ్రవరి8( జనంసాక్షి): మనుషులకు మాత్రమేకాదు..కోడికికూడా టిక్కెట్‌ కొట్టాల్సిందే అంటూ 30 రూపాయలుకట్‌ చేశాడా కండక్టర్‌. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదిమాత్రం నిజం. ఆ బస్‌ కండెక్టర్‌ నిర్వాకం కొందికి కోపం తెప్పించేలా ఉంది. మహ్మద్‌ అనే వ్యక్తి గోదావరి ఖని నుంచి కరీంనగర్‌కు తన కోడిపుంజును తీసుకుని ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. అయితే ఆ కోడిపుంజుకు 30 రూపాయల బస్‌ టికెట్‌ కొట్టి కండెక్టర్‌ షాకిచ్చాడు. దీంతో గత్యంతరం లేక మహ్మద్‌ తన కోడిపుంజుకు సైతం రూ.30 చెల్లించి బస్సులో ప్రయాణించాడు. ఇప్పుడు ఈ వార్త స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది.