సహకరా బ్యాంక్‌లో 30 లక్షల గోల్‌మాల్‌

గుంటూరు,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): నరసరావుపేట ప్రకాష్‌ నగర్‌లో ఉన్న గుంటూరు కేంద్ర సహకార బ్యాంక్‌లో 30 లక్షల నగదు గోల్‌ మాల్‌ అయ్యింది. ఖాతాదారులకు నోటీసులు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకు అధికారులతో యానిమేటర్‌ గౌరీ కుమ్మక్కై.. నగదు గోల్‌ మాల్‌కి పాల్పడినట్లు ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.