నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ52

 ` ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఇస్రో
నెల్లూరు,ఫిబ్రవరి 13(జనంసాక్షి): 2022లో తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం(ఇస్రో) సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ` సీ52 వాహకనౌక ప్రయోగాన్ని.. సోమవారం ఉదయం 5.59 గంటలకు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఇది 25 గంటల 30 నిమిషాలపాటు కొనసాగిన అనంతరం.. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. 1710 కిలోల బరువున్న ఆర్‌ఐశాట్‌, 1705 కిలోల ఐఎన్‌ఎస్‌`2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైట్‌`1 ఉపగ్రహాలను వాహకనౌక మోసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ శనివారం షార్‌కు చేరుకొని ఎమ్‌ఆర్‌ఆర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం కూడా ఆయన అక్కడే ఉండి కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు.. శాస్త్రవేత్తలతో వివిధ ప్రాజెక్ట్‌లపై సవిూక్ష నిర్వహిస్తున్నారు.