మే 8న తెరుచుకోనున్న బద్రీనాథ్‌ ఆలయం


డెహ్రాడూన్‌,ఫిబ్రవరి5 ( జనంసాక్షి ) :  ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని ఈ ఏడాది మే 8వ తేదీన పునం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శీతాకాలం దృష్ట్యా ఆ ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. మే 8వ తేదీన ఉదయం 6.15 నిమిషాలకు ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు చార్‌థామ్‌ బోర్డు సభ్యులు తెలిపారు. గత రెండేళ్ల నుంచి కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.