బిజెపికి ఇక ఉక్కిరిబిక్కిరి తప్పదు
ప్రజల నమ్మకాన్ని పూర్తికోల్పోచిన మోడీప్రత్యామ్నాయ రాజకీయాలపై కడియం
వరంగల్,ఫిబ్రవరి28(ఆర్‌ఎన్‌ఎ): కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా మిషన్ మొదలయ్యిందని...ఇక బిజెపి ఆటలు సాగవని టిఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మిషన్ తెలంగాణ చేపడుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. బిజెపి దేఆనికిఏ కాదు.. తెలంగాణకు కూడా ఏవిూ చేయలేదని గుర్తించాలన్నారు. అలాంటి బిజెపి బీజేపీ మిషన్ ఎలా నడుస్తుందని అన్నారు. ప్రజలు అంత అమాయకులు కాదుకదా అని అన్నారు. సీఎం కేసీఆర్ గర్వించదగ్గ స్థాయిలో అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడి అభివృద్ధి తమకూ అవసరమని దేశ ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళారీలను బాగు చేయడం మినహా ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. ప్రజల కోసం చేసిన ఒక్క మంచి పథకం ఏదో చెప్పాలని బీజేపీకి సవాల్ విసిరారు. దేశం మొత్తానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ఢల్లీిలోని బీజేపీ సర్కారును గ్దదె దింపే కార్యక్రమం మొదలైందని కడియం వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్‌ను రాష్టాన్రికే పరిమితం చేసేందుకు మిషన్ తెలంగాణ అని బీజేపీ అంటున్నదన్నారు. మిషన్ తెలంగాణ కార్యక్రమం చేపడితే బీజేపీకి ఉన్న పునాది కూడా పోవడం ఖాయమని హెచ్చరించారు. రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ పురుడుపోసుకోవడంలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు కెసిఆర్ ప్రధాన పాత్రపోషిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కొంతకాలం కేంద్రంలో పనిచేసింది. నిజానికి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో స్నేహ సంబంధాలనే కోరుకున్నారు. అభివృద్దికి
సహకారం అందించవలసిందిగా కేంద్రంలోని బీజేపీని అభ్యర్థిచారు. కానీ బిజెపికి రాష్టాల్రను అభివృద్ది చేయాలన్న కాంక్ష లేదన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మొదలెట్టిన ప్రత్యామ్నాయ ప్రయత్నం విజయవంతం అవుతుందన్నారు. ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసి మోడీని గద్దె దించే వరకు సాగగుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గొంతు కలుపుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో పోల్చితే తెలంగాణ సిఎం కెసిఆర్ సమర్థ నేత అని అన్నారు. నరేంద్ర మోదీ వ్యతిరేక ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించడానికి ఇతరులకు అభ్యంతరాలు లేవని అన్నారు. ఇకపై తాను పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెడతానని కేసీఆర్ ప్రకటించడం తో ఓ రకంగా బిజెపికి వణుకు పుట్టిందని అన్నారు. కెసిఆర్‌తో కలసి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగు తోందని అన్నారు. బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు అందరిలోనూ చర్చగా మారిందన్నారు. బిజెపిక అంత సీన్ లేదని రానున్న రోజుల్లో మరింత స్పష్టత రాగలదని కడియం అన్నారు.