విధ్యకమిటి అధ్యక్షుడిని సన్మానించిన యూత్ సభ్యులు

  


రుద్రంగి ఫిబ్రవరి 26 (జనం సాక్షి);
రుద్రంగి జిల్లా పరిషత్ పాఠశాలకు నూతన విద్య కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లి భూమేష్ ని మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో మిత్రులు శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ...పాఠశాల విధ్యకమిటి అధ్యక్షుడిగా ఎన్నికైనా మిత్రున్నీ చూసి గర్విస్తున్నామని అన్నారు.విద్యార్థుల సమస్యల పట్ల పాఠశాల అభివృద్ధి పట్ల శ్రద్ధ వహించి ప్రతి సమస్యను నూతన కమిటీ పరిష్కరించాలని కోరారు.పాఠశాల అభివృద్ధి లో భాగంగా మా యూత్ సహకారం విద్య కమిటీకి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ...పాఠశాల విధ్యకమిటి చైర్మన్ గా నన్ను ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే నన్ను సన్మానించిన మిత్రులకు దాన్యవధాలు తెలిపారు.పాటశాల అభివృద్ధి లో తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి యూత్ సభ్యులు పాల్గొన్నారు.