రాజీవ్ స్వగృహ గృహల వేలం

జనం సాక్షి బ్యూరో. నల్గొండ . నార్కట్ పల్లి మండలం యెల్లారెడ్డి గూడ గ్రామం లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన శ్రీ వల్లి టౌన్ షిప్ ప్లాట్ లను హెచ్ ఎం.డి.ఏ.ద్వారా ఈ ఆక్షన్ ద్వారా వేలం వేయుటకు ఏర్పాట్లు కొనసాగుతున్నవి.మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ శ్రీ వల్లి టౌన్ షిప్ లో రాజీవ్ స్వగృహ ప్లాన్ ప్రకారం ప్లాట్ లకు హద్దులు,నంబరింగ్ పనులు సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి.శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. హద్దులు, మార్కింగ్ పనుల ను సర్వేయర్ ల ద్వారా త్వరగా రెండు రోజుల్లో పూర్తి చేయుటకు  చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.