హైదరాబాద్,ఫిబ్రవరి5 ( జనంసాక్షి ) :
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడిరది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.38.59 లక్షలు విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్ళేందుకు ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన ఇద్దరిపై అనుమానం రావడంతో, వారిని తనిఖీ చేయగా వారి వద్ద విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.