ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయడం కోసం కృషి చేయాలి... ప్రజా గాయకుడు గద్దర్


ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి):-

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయడం కోసం కృషి చేయాలని ప్రజా గాయకుడు గద్దర్ కి ములుగు జిల్లా కేంద్రంలో వినతి పత్రం సమర్పించిన ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ అనంతరం గద్దర్ మాట్లాడుతూ ములుగు జిల్లా సమ్మక్క సారక్క నామకరణం కోసం అన్ని రాజకీయ పార్టీలు తీర్మానాలు చేయాలని ఉద్యమాన్ని కూడా ఉదృతం చేయాలని గద్దర్ పిలుపునిచ్చారు.సమ్మక్క సారక్క లు స్వయం ప్రతిపత్తి కోసం మా గూడెంలలో మేమే పరిపాలకుల మని ఉద్యమ చేసినారని గద్దర్ అన్నారు సమ్మక్క సారక్కలు ఉద్యమకారు లు అని గద్దర్ అన్నారు ఇది న్యాయమైన డిమాండ్ అని ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణ చేయవలసిందేనని గద్దర్ అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ములుగు జిల్లా కోసం ఏ విధంగా ఉద్యమాలు చేసినాము అదే స్ఫూర్తితో ఉద్యమాల కొనసాగిస్తామని కుమారస్వామి అన్నారు.18వ తేదీన కెసిఆర్ వస్తున్న సందర్భంగా సమ్మక్క సారక్క సన్నిధిలోని ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం చేయవలసిందేనని కుమారస్వామి అన్నారు.