అప్పులు..ఓవర్‌ డ్రాఫ్టులతో దివాళా

ఎపి పరిస్థితి దారుణంగా ఉందన్న పట్టాభిరామ్‌

అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): అప్పులు, ఓవర్‌ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని విమర్శించారు. వేజ్‌ అండ్‌ విూన్స్‌, ఓవర్‌ డ్రాప్టులు వాడటంలో దేశంలోనే..ఏపీ మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. దేశంలో 11 రాష్టాల్ర చేబదుళ్లు లేకుండా, 22 రాష్టాల్రు ఓడీ లేకుండా..15 రాష్టాల్రు స్పెషల్‌ డ్రాయింగ్‌లు లేకుండా పాలన చేస్తున్నాయన్నారు. ఈ రాష్టాల్రపై కరోనా ప్రభావం లేదా? అని ప్రశ్నించారు. ఏపీ 112 రోజులు ఓవర్‌ డ్రాప్టు, 193 రోజులు వేజ్‌ అండ్‌ విూన్స్‌ అడ్వాన్సులకెళ్లి.. రూ. 32,217 కోట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని పట్టాభి ప్రశ్నించారు. ఈశాన్య రాష్టాల్ర కంటే ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చేబదుళ్లు తీసుకోవడమంటే.. ఏపీ ఆర్థికంగా ఐసీయూలో ఉన్నట్టు కాదా? అని అన్నారు. తక్షణమే ఈ లెక్కలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ అసమర్థత రైతులకు శాపంగా మారిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ గిట్టుబాటుధర లేక, తెగుళ్లు, ఎరువుల ధరల పెరుగుదలతో..రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంటబీమా కట్టకపోగా రూ.650 కోట్ల వసూళ్లకు పాల్పడటం దుర్మార్గమన్నారు. యూరియా కోసం రైతులు క్యూలో గంటల తరబడి ఎదురు చూస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల్లో ఆర్భాటం తప్ప ఎరువులు దొరకడం లేదని రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.