*శంకరా ! ఇది న్యాయమా !?*

 పరమాత్మ శంకరా !

పశుపతీ పరత్మరా !!
నేను పాపినేనా!?
నీవిచ్చిన మానవరూపాన్నే                            పశుత్వం, దానవత్వం
నిండిన స్వరూపాన్నే
కాదనను అయినా
జపం, తపం 
ఉపవాసం, ఉపాసన
ముక్తి కలుగుతుందనే
ఆశతోనే కదా!
భక్తితోనో విరక్తితోనో
మోక్షానురక్తి
పిపాసనే కదా !
చేసేది నేనేనని
చేయించేది నేనేనని
విధి విష్ణు విన్యాసాలకు                       
    సాకారం నేనేనని
సెలవిచ్చిన నీవు
నన్నెందుకు పాపిని చేస్తావు!                         
  అపనిందల గంధం పూస్తావు!                         
  నన్ను నీడలా వెంటాడుతు                               
  ఆపదలో వేటాడుతు                                         
అహర్నిశలు కాపాడుతు
నా జీవితాన్ని కాపాడుతు
ఆటాడుకుంటున్నావు
కల్మషాన్నాపాదిస్తున్నావు!
న్యాయాన్యాయాలు
పాపపుణ్యాలు
దానధర్మాలు 
సత్యాసత్యాలు
ఏమీ తెలియని అమాయకుణ్ణి
నీ మాయాలోకంలో
అనామకుణ్ణి అల్పజీవుణ్ణి 
నన్నెందుకు నిందిస్తావు !                           
పాపాలతో బంధిస్తావు !!
 
*" రసస్రవంతి "&" కావ్యసుధ "*
 చరవాణి  : 9247313488
 హయాత్నగర్  : హైదరాబాద్