సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌


హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  ముచ్చింతల్‌లో కొలువై ఉన్న సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇంద్రకరణ్‌ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను చినజీయర్‌ స్వామితో పాటు వేద పండితులు శాస్తోక్తర్రగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని దేవాలయాలను పరిశీలించారు.సుమారు మూడు గంటల పాటు ఆయన సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు.