నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ఉదయం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈనేపథ్యంలో పనులను సీఎం పరిశీలించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పునర్‌నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కొండపైన, కొండ కింద అభివృద్ధి పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. మార్చి 21 నుంచి మహాసుదర్శనయాగం నిర్వహించనున్నారు. యాగస్థలి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గడువు సవిూపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్నారు.