హంద్రీనీవా నీటి నిలిపివేత తగదు: పయ్యావుల

అనంతపురం,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): హంద్రీనీవా కాలువపై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆందోళనకు దిగారు. రైతులతో కలిసి హంద్రీనీవా కాలువపై నిరసన చేపట్టారు. పంటలకు అర్దాంతరంగా నీటిని నిలిపివేసిన ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేయాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో సుమారు 50 వేల ఎకరాల్లో వేరుశనగ మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు.