దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి


- గురప్ప స్వామి దేవాలయం గుడి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

 మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలమార్చుకోవాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మునగాల  మండలం తాడువాయి గ్రామంలో యాదవుల ఆరాధ్యదైవం శ్రీ గురప్ప స్వామి దేవాలయ గుడి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక దశాబ్దాల నుండి పూజలందుకుంటున్న గురప్ప స్వామి దేవాలయ పునర్నిర్మాణ చేసుకోవడం శుభసూచకమని అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు. తెరాస  ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు. ఆ దేవదేవుడు దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూలతూగాలని అన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం పసిడిపంటల తోటి వర్ధిల్లాలని అన్నారు. ఆ గురప్ప స్వామి కృపతో పాడి పశువులు సిరి సంపదలతో ప్రజలందరూ జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, వైస్ యంపిపి బుచ్చిపాపయ్య, పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ కోలా ఉపేందర్, సర్పంచ్ సంజీవ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి యలక వెంకటరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు లఖ్యా నాయక్, బండారు సత్యం, గంధం నరసింహారావు, శ్రీనివాసరావు, నాగిరెడ్డి, ధర్మకర్త రామ్ రెడ్డి, వట్టిఆవుల వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు స్వామి, సోమయ్య, చిర్రా సైదులు పాల్గొన్నారు.