ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం..


 -టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ.

 ములుగు,ఫిబ్రవరి 10(జనంసాక్షి):- కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పాలన అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అన్నారు.ములుగు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చొరవతో మంగపేట మండలంలో బోర్ నర్సాపురం గ్రామానికి చెందిన మైల శ్రీనువాస్ కు 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయింది.


ఈ రోజు బోర్ నర్సాపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యం పొంది ఆర్ధికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆలోచనతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ పేదల అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పిఎసిఎస్ చైర్మన్ తోట రమేష్, రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరిరావు ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్లు నర్రా శ్రీధర్, సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి,ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం ,మండల ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్ చారి, బీసీ సెల్ మండల అధ్యక్షులు శానం నరేంధర్,మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరస్వామి,మండల నాయకులు,చిట్టిమల్ల సమ్మయ్య, కటికనేని సత్యనారాయణయర్రంశెట్టి రామకృష్ణ, ముగల రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు,,కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనువాస్,బోర్ నర్సాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు రావుల రమణ,తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్, కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టిమల్ల బాలక్రిష్ణ ,మండల యూత్ నాయకులు కన్నా సంపత్,పిల్లమర్రి వేణు ,యాస నాగేందర్ ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,జాడి కృష్ణ, కోమరెల్లి, కెక్కం జగదీష్,సందీప్, మూగల రాము తదితరులు పాల్గొన్నారు.