డ్రగ్స్, గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు,ప్రజలు బాధ్యత తీసుకోవాలి


మన పిల్లలకు మంచి భవిష్యత్ అందించడం  మన అందరి బాధ్యత: సీఐ లక్ష్మి నారాయణ

 రామగుండం జనంసాక్షి:

 అంతర్గం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్గం  మండలం లోని ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లకు నిషేధిత డ్రగ్స్, గంజాయి పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సంధర్భంగా సీఐ గారు మాట్లాడుతూ....గ్రామాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ గ్రామాలను  డ్రగ్స్, గంజాయి రహిత గ్రామాలుగా మార్చేందుకు కృత నిచ్చయం ఉండాలని ఆయా గ్రామాల సర్పంచ్ లకు, ఎంపీటీసీ లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు సీఐ గారు పిలుపునిచ్చారు. గ్రామాలలో  డ్రగ్స్ , గంజాయి ఉత్పత్తి, సరఫరా, మరియు వినియోగించే వారి పై ప్రత్యేక నిఘా ఉంచి గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డ్రగ్స్ , గంజాయి ని ఉత్పత్తి, సరఫరా చేసే వారి వెనుక  ఎంతటి వారు ఉన్న, ఏ పార్టీ వారు ఉన్న  వదిలే ప్రశక్తి లేదని అట్టి వారి పై పిడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాము అని సీఐ గారు అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు వ్యసనాలకు పాల్పడి మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్నెస్ ను కోల్పోవడం,  అనారోగ్యం బారినపడటమే కాకుండా తాము ఏమి చేస్తున్నామో అనే సెన్స్ ను కోల్పోయి, ఆర్థిక పరితిస్థితులు దిగ జారీ నేరాలకు పాల్పడటం జరుగుతుందని యువత పై అంతగా ప్రభావం చూపే ఈ డ్రగ్స్ ,గంజాయి పదార్థాల ఉత్పత్తి, సరఫరా ను తమ ప్రాంతంలో గుర్తించి పోలీస్ వారికి సమాచారం అందించుటకు  గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వార్డు మెంబర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గ్రామాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో గాని గంజాయి మొక్కలు  దొరికిన సంబంధికుల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి   PD యాక్ట్ కేసు నమోదు చేస్తామని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన  అసైన్డ్ భూములలో గంజాయి మొక్కలు దొరికిన ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని అలాగే పట్టా భూములలో గంజాయి దొరికిన ఆ భూమి యజమానికి రైతు బంధు రాకుండా కలెక్టర్ ద్వారా రద్ద చేయడం జరుగుతుందని మరియు గ్రామంలో 5 కన్న ఎక్కువ డ్రగ్స్/ గంజాయి కేసులు నమోదు అయిన ఆ గ్రామనికి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ రద్దుకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని ఈ విషయాన్ని  గ్రామాల ప్రజలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. 


 అంతర్గం ఎస్ ఐ శ్రీధర్, ఎక్సైజ్ ఎస్సై శారద, మండలం లోని ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.