విద్యుత్రంగం ప్రైవేటీకరణకు కుట్ర

 


వ్యవసారంª`గాన్ని దివాళా తీయించిన బిజెపి
విభజనపై ఎందుకు న్యయం చేయలేదో చెప్పాలి
విూడియాతో సిపిఎం నేత బివి రాఘవులు
నెల్లూరు,ఫిబ్రవరి10(జనంసాక్షి): విద్యుత్‌ రంగం మొత్తాన్ని ప్రైవేట్‌ చేసేందుకు.. ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాఘవులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జెన్‌కో అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. నాసిరకం బొగ్గు సరఫరా చేసినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగం కుదేలవడానికి బీజేపీ సర్కారే కారణమన్నారు. కేంద్రాన్ని రాష్టాల్రుప్రశ్నించాలన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి లేదని రాఘవులు పేర్కొన్నారు. గురువారం నాడిక్కడ మాట్లాడుతూ ఆంధ్ర,
తెలంగాణ విభజనపై కాంగ్రెస్‌ తప్పు చేసిందని పార్లమెంట్‌లో మోడీ ఆందోళన వ్యక్తం చేశారని...అయితే విూరేం చేశారంటూ మోడీని ప్రశ్నించారు. ఉద్యోగ, కార్మిక, సామాన్య ప్రజానీకానికి ఇది అమృతకాలం కాదని, రాహుకాలమని తెలిపారు. మనం బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకున్న సొమ్మును శత కోటీశ్వరులకు అప్పులిచ్చి... ఫ్యాక్టరీలను కారు చౌకగా మోడీ ప్రభుత్వం అమ్మేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ కాలంలో టాటా, బిర్లా ప్రభుత్వమని అనేవారని, మోడీ పాలనలో అంబానీ, ఆదానీ ప్రభుత్వంగా వ్యాఖ్యానిస్తు న్నారని చెప్పారు. టాటా, బిర్లా ఐదువేల కోట్లు సంపాదించడానికి కొన్నేళ్లు పట్టిందని, మోడీ హయాంలో 142 మంది శతకోటీశ్వరులయ్యారని అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మేయాలని చూస్తున్నారని తెలిపారు. ఎయిరిండియాను ’చెత్త’కింద అమ్మేసినా రూ.40 వేల కోట్లు వచ్చేదని, అలాంటిదాన్ని కేవలం రూ.18 వేల కోట్లకు అమ్మేశారని విమర్శించారు. అమ్మకానికి సాధ్యం కాని చోట మానిటైజేషన్‌ పేరుతో లీజుకిస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో డ్రెస్‌కోడ్‌ విషయంలో బిజెపి మతం రంగు పులుముతోందని, ముస్లిం, హిందువుల మధ్య ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. పార్లమెంట్‌లో వైసిపి ఎంపిలు బ్జడెట్‌ సందర్భంగా రాష్టాన్రికి అన్యాయం జరిగిందని మాట్లాడారని, ఎంపిల కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే బిజెపితో అంటకాగితే ప్రభుత్వానికి భవిష్యత్‌ ఉండదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి కూడా బిజెపిని ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. రానున్న కాలంలో విశాలమైన ఐక్యతతో బిజెపి మతతత్వ రాజకీయ అజెండాను ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు అర్ధం చేసుకుని తిప్పికొట్టాలని కోరారు. అధిక ధరలు, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో జరగనున్న అఖిలభారత సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.