ఈ బడ్జెట్ చారిత్రకం కానుందన్న సిఐఐ
హైదరాబాద్,ఫిబ్రవరి1 (జనం సాక్షి): ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి గతి శక్తి వల్ల పురోభివృద్ధికి దోహదం చేస్తుందని, ఈ బడ్జెట్ చారిత్రాత్మకం అని సీఐఐ ఛైర్మన్ తిరుపతి రాజు అన్నారు. రోడ్ల నిర్మాణం ప్రణాళిక హర్షించదగింది. నదుల అనుసంధానం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్హి, వనరుల వినియోగానికి బాగా ఉపకరిస్తుందన్నారు. మెజార్టీ వాటా గతి శక్తికి కేటాయించడం చాలా ప్రయోజనకరం. స్కూళ్ల డిజిటలైజేషన్ విద్యావ్యవస్థలో మార్పుకి అవకాశం కల్పించింది. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు, పరిశ్రమలతో అనుసంధానం బాగా ఉపకరిస్తుందన్నారు. ఉత్పత్తి ఆధారిత ఆదాయం కారణంగా టాక్సుల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. ఫార్మా సెక్టార్ ను పట్టించుకోకపోవడం నిరాశ పరిచింది. కోవిడ్ సమయంలో దెబ్బతిన్న టూరిజం, హాస్పిటాలిటీ రంగాలపై ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. వేతన జీవులకు నేరుగా పన్ను మినహాయింపు లేకపోవడం కొంత నిరాశ పరిచిందన్నారు తిరుపతిరాజు. ప్రయివేటీకరణ వల్ల పరిశ్రమలు నష్టపోతాయనే వాదనను ఏకీభవించలేం. మేకిన్ ఇండియా ఉత్పత్తులపై అంతర్జాతీయ స్థాయిలో నమ్మకం కలిగించే దిశగా చొరవ తీసుకోవాలన్నారు.
నదుల అనుసంధానం ఆహ్వానించదగ్గది