"కెసీఆర్... మతిభ్రమించిన మాటలొద్దు బిజెపి


 పెన్ పహాడ్ .  ఫిబ్రవరి 03 (జనం సాక్షి) : ముఖ్యమంత్రి కేసీఆర్  బారత రాజ్యాంగం పట్ల, ప్రపంచ ఆరాధ్యుడు   ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అభేద్యమైన పాలనను జీర్ణించుకోలేక    స్థాయిని మరిచి  కుత్సితబుద్ధితో వ్యవహరిస్తుండని  ఇక  పై మతిభ్రమించిన మాటలొద్ధని  భాజపా మండలాధ్యక్షులు పోకల రాములు,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, పెన్పహాడ్ మండల ఇంఛార్జ్ పోకల వెంకటేశ్వర్లు అన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ   అహంకారపూరితంగా మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,   రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు గారి   పిలుపు మేరకు  గురువారం  పెన్‌పహాడ్‌  మండల కేంద్రంలో   అంబేద్కర్ గారి విగ్రహనికి  పాలాభిషేకం నిర్వహించి   పూలమాలలు వేశారు.   అనంతరం  కేసీఆర్ నోటి దురుసుకు వ్యతిరేకంగా  భీమ్ దీక్షను చేపట్టి,  నిరసన కార్యక్రమం నిర్వహించారు .   ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ   విశ్వంలోని ప్రపంచ దేశాలు మొత్తం మోడీ అభివృద్ధి సంక్షేమాన్ని కీర్తిస్తుంటే  బీజేపీ దూకుడును తట్టుకోలేక  కల్వకుంట్ల కుటుంబ పాలన అంతిమదశకు చేరిందన్న విషయాన్ని గ్రహించి  పిచ్చి తుగ్లక్ లా వ్యవహరిస్తుంఢన్నారు.   కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అభివృద్ది సంక్షేమఫలాలకు  తన ఫోటోలు వేసుకొని శంకుస్థాపనలు చేయడం  తప్ప కెసిఆర్ చేసింది శూన్యమన్నారు.  ఇప్పటికైనా పిచ్చి కూతలు మాని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఎదురుదాడికి చిత్తవడం ఖాయమన్నారు.    ఈ కార్యక్రమంలో బిజెపి  మండల ప్రధాన కార్యదర్శులు నకరికంటి వెంకన్న ,    చెన్ను రమణారెడ్డి,   చామకూరి వెంకటేష్,  లూనావత్ వీరన్న,  గండ్ర వెంకట రెడ్డి ,  మెడం వీరయ్య ,  నన్నెపంగు   మట్టయ్య,  బొల్లెద్ధు సంతోష్,పర్వతం వెంకన్న.  సైదులు   , తదితరులున్నారు