ఆందోళనచేస్తున్న ఉపాధ్యాయులపై నిఘా

బయోటమెట్రిక్‌ తప్పనిసిర చేస్తూ ఆదేశాలు
అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): మెరుగైన పీఆర్సీ, ఇతర డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెంచింది. ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు ఉపాధ్యాయులు పాఠశాలల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తే సీసీయే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరికలు పంపింది. పలు ప్రాంతాల్లో బయోమెట్రిక్‌ మిషన్లు పనిచేయకపోవడంతో సెల్‌తో అటెండెన్స్‌ను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్‌ వేయాలని కోరింది. తమకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న.. తమను
దూషిస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని స్టీరింగ్‌ కమిటీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం కత్తి దూషింది. నల్ల బ్యాడ్జీలతో పలు పాఠశాలల్లో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులపై పోలీసులు నిఘా విధించారు.