ఎమ్మెల్సీగా దండే విఠల్ ప్రమాణ స్వీకారం


  నిర్మల్ బ్యూరో, ఫిబ్రవరి21,,జనంసాక్షి,,,,  ఉమ్మడి అదిలాబాద్ జిల్లా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రొటెం చైర్మన్‌ జాఫ్రీ.... విఠల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ,  పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు. ఈ  సదర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... ఎమ్మెల్సీ విఠల్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.