ఉత్తమ పోలీస్‌ స్టేషన్లుగా ఎంపిక

మంచిర్యాల,ఫిబ్రవరి11(జనం సాక్షి): జిల్లాలోని భీమారం, జైపూర్‌, సీసీసీ నస్పూర్‌ పీఎస్‌లు రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్లుగా నిలిచాయి. 2021 ఏడాదికిగాను ఈ అవార్డును దక్కించుకున్నాయి. పోలీస్‌ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు, కచ్చితమైన విశ్లేషణ, నేరాల నివారణ, సమర్థవంతమైన విచారణ, ప్రొయాక్టివ్‌ పోలీసింగ్‌, 5ఎస్‌ ఇంప్లిమెంట్‌, వర్టికల్‌ పర్ఫార్మెన్స్‌, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ మొదలైన రంగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నాలుగు విభాగాల్లో అవార్డులను అందిస్తున్నది. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి పెద్దపల్లి జోన్‌ రామగుండం పోలీస్‌ స్టేషన్‌ కేటగిరి` 2 (151 `220), మంచిర్యాల జోన్‌లో భీమారం పోలీస్‌ స్టేషన్‌ కేటగిరి` 1 (0`150), జైపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ కేటగిరి`3 (221`350), సీసీసీ నస్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ కేటగిరి` 4 ( 350`అంతకంటే ఎక్కువ)లో ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌ అవార్డును దక్కించుకున్నాయి. ఉత్తమ పోలీస్‌ స్టేషన్లుగా ఎంపికయ్యేలా పనిచేసిన ఏసీపీ, సీఐ, ఎస్‌హెచ్‌వో, అధికారులు, సిబ్బందిని రామగుండం సీపీ చంద్రశేఖర్‌ రెడ్డి అభినందించారు.