సిద్దిపేట బ్యూరో, ఫిబ్రవరి23(జనంసాక్షి):
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మల్లన్నసాగర్ లోకి గోదావరి జలాలు విడుదల పర్యటన విజయవంతం అయిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జయప్రదంకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మేరకు మంత్రి బుధవారం సాయంత్రం మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ హన్మంతరావు, పోలీసు కమిషనర్ శ్వేత, అడిషనల్ కలెక్టర్లు ముజమ్మీల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓలు, జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం, సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయులు, వివిధ శాఖల అధికారిక యంత్రాంగం, సిబ్బంది, అన్నీ శాఖలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయినట్లు తెలిసిన వెంటనే పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు గత నాలుగు రోజులుగా అహర్నిశలు శ్రమించారని, కష్టపడ్డ ప్రతి అధికారికి, పోలీసు సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, సీఎం కేసీఆర్ పర్యటన, సభ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.