మోబైల్‌ షాపులో భారీచోరీ

తిరుపతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): నగరంలోని ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రూప్‌ థియేటర్స్‌ సవిూపంలో ఉన్న మునిమొబైల్స్‌లో మంగళవారం తెల్లవారుజామున దుండగుడు చోరీకి తెగబడ్డాడు. 30 మొబైల్స్‌, రూ.50వేల నగదు అపహరణకు గురైంది. ఆగంతకుడు చేసిన చోరీ దృశ్యాలు సీసీఫుటేజ్‌లో రికార్డ్‌ అయ్యాయి. షాప్‌ యజమాని ఫిర్యాదు మేరకు ఈస్ట్‌ పోలీసులు, క్లూస్‌ టీం సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాల సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.