మేడారానికి హెలికాప్టర్‌ సేవలు


రేపటి నుంచి హనుమకొండ నుంచి ప్రారంభం..

రానుపోను ఒక్కొక్కరికి రూ.19,999...

ఏరియల్‌ వ్యూ రైడ్‌కు రూ.3,700....

ములుగు,ఫిబ్రవరి12(జనం సాక్షి):-

మేడారం మహాజాతరకు హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం నుంచి జాతర జరిగే వరకు హన్మకొండ నుంచి మేడారం వరకు హెలికాప్టర్‌ నడిపించేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది.కాగా, జాతర ఈనెల 16వ తేదీ నుంచి 19 వరకు జరగనుంది.అయితే ముందస్తుగానే హెలికాప్టర్‌లో జాతరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్‌ సంస్థ హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు హెలిప్యాడ్‌ సిద్ధం చేసింది.ఇందుకోసం ఒక్కోక్కరికి రూ.19,999లను రానుపోను చార్జీగా నిర్ణయించారు.అలాగే మహాజాతరలో ఏరియల్‌ వ్యూ రైడ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.జాతర జరిగే ప్రాంతంలో పది నిమిషాల పాటు హెలి రైడ్‌ చేసేందుకు ఒక్కరికి రూ.3,700లుగా ధర నిర్ణయించారు.కాగా,జాతరకు హెలికాప్టర్‌లో ప్రయాణించాలనుకునే వారు మొబైల్‌ ఫోన్‌ నెంబర్లు 9400399999, 9880505905 ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు.