తోటి గ్రామీణ వైద్యుని కుటుంబానికి ఆర్థిక సహాయం


మునగాల, ఫిబ్రవరి 11(జనంసాక్షి): మండలంలోని రేపాల గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు చిన్నారావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం అందరికీ విధితమే. అతను నిరుపేద కుటుంబం కావడంతో మండల గ్రామీణ ఆర్ఎంపి వైద్య సంఘం స్పందించి 11 వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని శుక్రవారం చిన్నారావు కుటుంభానికి అందించారు. ఈ కార్యక్రమంలో లింగయ్య, నాగరాజు, రాంబాబు, రవి, శ్రీశైలం, భిక్షం, మదనాచారి, సోమన్న, సాయి, నరసింహారావు, మహేష్  తదితరులు పాల్గొన్నారు.