కరోనా బద్దకాన్ని వీడి ముందుకు సాగాలి
సబ్జక్టుపై పట్టు సాధిస్తేనే సీటు సాధ్యం
హైదరాబాద్,ఫిబ్రవరి18ఆర్‌ఎన్‌ఎ): ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య కోర్సులను ఉత్తమ విద్యాసంస్థల్లో చదివితేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే చాలా మంది అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదువుకోవాలని పాఠశాల స్థాయి నుంచే కలలు కంటారు. వీటిని నిజం చేసుకోవాలంటే ఏదో ఒక పోటీ పరీక్షలో ఉన్నతమైన ర్యాంకు సాధించక తప్పదు. కరోనాతో ఇప్పటికే వరుసగా రెండేళ్ల పాటు పరీక్షలన్నీ నిలిచి పాస్ విధానం అవలంబించారు. విద్యారంగం తీవ్రంగా దెబ్బతింది. పిల్లల మానసిక స్థితి దెబ్బతింది. కొన్ని రోజుల తేడాతో అనేక పరీక్షలన్నీ వేసవి కాలంలో ఒకేసారి ఉంటాయి. ముందస్తు ప్రణాళికలు లేకుంటే విద్యార్థులు మంచి మార్కులు సాధించడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే అనేక సెట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. వీటిలో దేనికి సన్నద్ధం కావాలో విద్యార్థులు ముందుగా నిర్ణయించుకోవాలి. పదోతరగతి వారికి పాలిటెక్నిక్, టీఎస్ ఆర్‌జేసీ, ఇంటర్ పూర్తి చేసిన వారికి ఎంసెట్, లా సెట్ తదితర పరీక్షలు ఉండగా డిగ్రీ వారికి ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఓయూ, కేయూ సెట్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సెట్, బీటెక్, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారికి పీజీఈసెట్ తదితర పోటీ పరీక్షలుంటాయి. ఇంటర్‌తో యూజీడీపీఈడీ (అండర్‌గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్), డిగ్రీ పట్టాతో బీపీఎడ్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి. దీని కోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. న్యాయశాస్త్రంలో ఆసక్తి ఉన్న వారు చేసే లాసెట్ అడ్మిషన్లకు ప్రపిఏర్ కావాలి. ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇందులో ప్రధానమైంది. ఉభయతెలుగు రాష్టాల్ల్రో ఈ టెస్టుకు లక్షల్లో విద్యార్థులు హాజరవుతారు. దీని కోసం వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని పరీక్షలను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ చేయడానికి నిర్వహించే ఐసెట్ షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేయనునక్నారు. దీని కోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను మే మొదటి వారం నుంచి స్వీకరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రెండేళ్ల బద్దకాన్ని వదిలి విద్యార్థులు సన్నద్దం కావాలి. వారిని తల్లిదండ్రులు సన్నద్దంచేయాలి.