తెలంగాణలో ప్రతి గడపకు సంక్షేమం


సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీచేసిన మంత్రి

వనపర్తి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ప్రతి ఊరిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ అని నిరంజన్‌ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు అందజేసి మాట్లాడారు. జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న నల్లచెరువు, తాళ్ల చెరువు, ఈదుల చెరువు, రాజనగరం చెరువు, శ్రీనివాసపూర్‌ లక్ష్మీకుంటలను పునర్నిర్మించి పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు అహ్లాదకర వాతావరణం ఆస్వాదించేలా చెరువులు, కుంటలపై వాకింగ్‌ ట్రాక్‌ లు, బోటింగ్‌, గాª`డ్గంªనింగ్‌ వంటి సుందరీకరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. వనపర్తి రోడ్ల విస్తరణ కొనసాగుతున్నది. పట్టణం నుంచి వచ్చే మురుగునీటి వ్యవస్థను శుద్ధి చేసేందుకు సీవరేజ్‌ ఎª`లాంట్‌ నిర్మిస్తామన్నారు. పెబ్బేరు ? పాన్‌ గల్‌ ? కొత్తకోట రహదారులను కలుపుతూ బైపాస్‌ రోడ్‌ నిర్మిస్తామని ఆయన తెలిపారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని మంత్రి తెలిపారు.