శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

తిరుమల,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  తిరుమల శ్రీవారిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదన్‌ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వెంకన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఎమ్మెల్సీకి వేదపండితులు వేదాశీర్వచనం అందిచగా, టిటిడి ఆలయ అధికారులు స్వామి వారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల ఎమ్మెల్సీ మధుసూదన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల వచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యలతో ఉండలని వేంకటేశ్వరస్వామిని ప్రార్దించానన్నారు. రెండు తెలుగు రాష్టాల్ర ప్రజలు ఎప్పడు కలిసి మెలసి ఉండాలని ఆయన ఆకాక్షించారు.