ధర్నాకు వెళుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  బీజేపీ తలపెట్టిన ధర్నాకి వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావును మార్గమధ్యమంలోనే అడ్డుకున్న పోలీసులు.. అనంతరం ఆయన్ని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. గోరక్షణ కోసం పాటుపడుతున్న హిందూ సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ కర్మన్‌ఘాట్‌ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావును.. అనుమతి లేదంటూ వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం ఆయన వాహనంలోనే ఎమ్మెల్యే రఘునందన్‌ రావును అరెస్ట్‌ చేసి ఘట్కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.