లోకేశ్‌ వ్యాఖ్యలు దారుణం: గుడివాడ

విశాఖపట్నం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   సీఎం జగన్‌పై లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ ఖండిరచారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..జగన్‌ని విమర్శించే హక్కు లోకేష్‌కి లేదన్నారు. చిరుతిళ్లు పైకథనం రాసినందుకు చిన బాబుకి కోపం వచ్చినట్లు ఉందన్నారు. వైజాగ్‌లో మిలన్‌ కార్యక్రమం జరగడం..జగన్‌ ముఖ్య అతిథిగా రావడం లోకేష్‌ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. లోకేష్‌ సొంత బాబాయి సంగతి ఏమిటి? ఆయన్ను ఎందుకు దాచేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జూనియర్‌ ఎన్ఠీఆర్‌ సినిమాలకు ట్వీట్‌ పెట్టరు..కానీ డూప్‌ హీరో కి మాత్రం ట్వీట్‌

పెడతారని ఎద్దేవా చేశారు. వైఎస్‌, వివేక్‌ హత్యపై సీబీఐ విచారణ మొదట కోరింది జగనేనని అన్నారు. ఈ కేసులో పాత్రధారులు, సూత్రధారులు తేలాల్సిందేనన్నారు. సీబీఐ సీబీఎన్‌ తో కలిసి పనిచేస్తుందని అమర్నాథ్‌ తెలిపారు.