మునగాల, ఫిబ్రవరి 11(జనంసాక్షి): ఇటివల యాక్సిడెంట్ లో గాయపడి హైద్రాబాద్ లోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సురెష్ గురించి కోదాడకు చెందిన జలగం సుధీర్ కెటీఅర్ కు విజ్ఞప్తి చేయగా స్పందించిన కెటీఅర్ కార్యాలయం సిబ్బంది శుక్రవారం ఫోన్ ద్వారా సురేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇవ్వటం జరిగింది. చికిత్స మరియు మెడికల్ బిల్లుల విషయంలో ఏదైన ఇబ్బందులు ఉంటే తమకు తెలియచేయాలని, సురేష్ ఆరోగ్యం కుదుటపడటానికి తమ ఆఫీస్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఆందోళన చెందవద్దని ఆఫీస్ సిబ్బంది కెటీఅర్ సూచనలతో సురేష్ కు ధైర్యం చెప్పారు.
గాయపడ్డ మారోజు సురేష్ కుటుంబానికి కెటీఅర్ ఆఫిస్ నుండి ఫోన్