దళితుల జీవితాల్లో వెలుగులు


దళితబంధుతో మారనున్న ఆర్థికస్థితి: మంత్రి

కరీంనగర్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పేద దళితులను ఆర్థికంగా పైకి తసీఉకుని వచ్చే క్రమంలో వారికి స్వయం ఉపాధి పథకాలను అందచేస్తున్నారని అన్నారు.మంగళవారం కరీంనగర్‌లోని 25వ డివిజన్‌ అరుంధతి నగర్లోరూ. 10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నగర మేయర్‌ సునీల్‌ రావుతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. లబ్దిదారులకు సొంత స్థలం ఉంటే ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టించే పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి నిరుపేద కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను అందిస్తామని వెల్లడిరచారు. అరుంధతి నగర్‌ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం అద్భుతంగా చేపడుతామని 10 లక్షల రూపాయలు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ కార్పొరేటర్‌ ఎడ్ల సరిత, కంసాల శ్రీనివాస్‌,
నేతికుంట యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.