కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి:మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి..


నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని అరిబండి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసగించి ఓట్లు దండుకొని హామీలు మరిచరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరి అభివృద్ధి చేయాల్సింది పోయి,అభివృద్ధిని పక్కనపెట్టి ప్రజలపై పన్నులు వేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశంలో పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యవసర ధరలను పెంచుతూ పేదవాడికి భారంగా మారిందని,.

దేశం గతంలో 55 లక్షల కోట్లు అప్పుల్లో ఉందని బిజెపి పరిపాలనలో 7 సంవత్సరాల ఆరు నెలల్లో  ఈ అప్పు కోటి 45 లక్షల కోట్లు అయిందని ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆయన అన్నారు.116 పేద దేశాల జాబితాలో భారత్ 103  స్థానంలో ఉందన్నారు.విద్యా,వైద్యం,ఉపాధి రంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.దేశంలో నిరంకుశ పాలన సాగుతోందని ప్రజలపై మత విద్వేషాలు రెచ్చగొట్టి పక్క దేశాల పేర్లు చెప్పి అడ్డుకుంటున్నారని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్రాసిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది అభివృద్ధి కోసమే అని చెప్పే కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల ఊసే లేదని గత మూడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్ లేవని మోడీ ఒక పెద్ద రాజు కేసిఆర్ ఒక చిన్న రాజ నే భ్రమలో పరిపాలిస్తున్నారు అని  ఆయన అన్నారు. కేరళ తమిళనాడు ప్రభుత్వాలు నిర్ణయాలు వెంటనే తీసుకోరాని, ప్రతిపక్షాలతో చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నోట్ల రద్దు, 370 ఆర్టికల్, రైతు చట్టాలు,జిఎస్టి మరియు కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకు వచ్చిందని  రైతులు సంవత్సర కాలంగా పోరాటం చేశారని దాని ద్వారా అ చట్టాలన్ని రద్దు చేశారని

.వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి  విదేశాలకు పలాయనం చిత్తగించెవారికి బిజెపి సహకరిస్తుందని ఆయన వాపోయారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి రానున్న కాలంలో సిపిఎం పార్టీ గ్రామగ్రామాన పల్లెపల్లెనా వాడ వాడ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతుల్ని చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై పోరాడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు.కొదమగుండ్ల నగేష్.సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యుడు జి వినోద్ కుంకు తిరుపతయ్య వెంకన్న తదితరుల పాల్గొన్నారు.